![]() |
![]() |

కరోనా ఎఫెక్ట్ తో 2020 క్యాలెండర్ ఇయర్ లో పలువురు స్టార్స్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయలేకపోయారు. మరీ ముఖ్యంగా.. నిన్నటి తరం నలుగురు అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఈ సంవత్సరం వెండితెరపై దర్శనమివ్వనేలేదు. వాస్తవానికి వీరందరి చిత్రాలు 2020 వేసవిని లక్ష్యంగా చేసుకుని నిర్మాణ దశలో ఉండగా.. కరోనాతో ఆ ప్లానింగ్ కాస్త మారిపోయింది. దాంతో 2020 వేసవిలో రావాల్సిన ఆచార్య (చిరు), BB3 (బాలకృష్ణ), వైల్డ్ డాగ్ (నాగ్), నారప్ప (వెంకీ) చిత్రాలు.. దాదాపు ఏడాది పాటు వాయిదా పడి 2021 సమ్మర్ లో వినోదాలు పంచనున్నాయి.
ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే.. చిరు, బాలయ్య, నాగ్, వెంకీ.. ఇలా ఈ నలుగురూ ఇదివరకు జీరో రిలీజ్ ఇయర్ సందర్భాలు చూశారు. అయితే నలుగురూ ఒకే ఏడాదిలో ఇలాంటి సందర్భం చూడలేదు. దీంతో.. ఈ స్టార్స్ నలుగురు వెండితెరపై దర్శనమివ్వని ఏకైక సంవత్సరంగా 2020 తెలుగు చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయింది.
![]() |
![]() |