![]() |
![]() |

కెరీర్ ఆరంభంలో ఛలో, గీత గోవిందం చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది కన్నడ కస్తూరి రష్మిక మందన్న. ఆ తరువాత వచ్చిన దేవదాస్, డియర్ కామ్రేడ్.. ఈ టాలెంటెడ్ బ్యూటీని నిరాశపరిచాయి. ఇలాంటి నేపథ్యంలో.. 2020 సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరుతో సాలిడ్ హిట్ ని అందుకుంది రష్మిక. ఆపై భీష్మతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. సంక్రాంతి సీజన్ లో సరిలేరు నీకెవ్వరు విడుదలవ్వగా.. మహాశివరాత్రి పర్వదినాన్ని లక్ష్యంగా చేసుకుని భీష్మ థియేటర్స్ లో సందడి చేసింది..
దీంతో.. తక్కువ గ్యాప్ లోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని అందుకుని హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది మిస్ మందన్న. ఈ క్యాలెండర్ ఇయర్ లో మరే కథానాయిక కూడా ఇలా రెండేసి విజయాలతో అలరించలేకపోయింది. ఆ రకంగా చూస్తే.. 2020 సంవత్సరం రష్మికకి ప్రత్యేకమనే చెప్పాలి. అలాగే, ఈ సంవత్సరంలోనే తొలి బాలీవుడ్ మూవీకి సంతకం చేసింది. ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళే లోపే మరో హిందీ సినిమా కూడా తన ఖాతాలో చేరింది. మరోవైపు పుష్ప లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లోనూ నటిస్తూ వార్తల్లో నిలిచింది. 2021లోనూ రష్మిక ఇదే హవా చాటుతుందేమో చూడాలి.
![]() |
![]() |