![]() |
![]() |

తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్.. విజయ్. దళపతిగా ఆయనను అభిమానులు ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. ఆయన సినిమా రిలీజైతే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా, ఇంతా కాదు. తమిళ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే హీరోగా పేరున్న ఆయన సినిమా 'మాస్టర్' విడుదలకు సిద్ధమవుతోంది. కార్తి సినిమా 'ఖైదీ'తో డైరెక్టర్‌గా అందర్నీ తనవేపుకు తిప్పుకున్న లోకేశ్ కనకరాజ్ ఈ సినిమాకి డైరెక్టర్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా దెబ్బకు వాయిదా పడింది.
ఇప్పుడు పొంగల్ సందర్భంగా జనవరి 13న థియేటర్‌లో రిలీజ్‌కు 'మాస్టర్' రెడీ అవుతోంది. గత నెలలో ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు దానికి వచ్చిన రెస్పాన్స్ అమోఘమనే చెప్పాలి. ఫ్యాన్స్ దాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఫలితంగా నెలరోజుల్లోనే 51 మిలియన్ వ్యూస్‌ను అది దాటేసింది. ఇక ఫ్యాన్స్ చేసిన కామెంట్స్ అయితే 1 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేశాయి. ఈ నేపథ్యంలో 'ఆర్ఆర్ఆర్'కు సంబంధించి రాజమౌళి టీమ్ విడుదల చేసిన 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ రికార్డ్‌ను అది బీట్ చేసింది.
జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తోన్న కొమరం భీమ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టీజర్‌గా రిలీజైన 'రామరాజు ఫర్ భీమ్' తెలుగు టీజర్ 36 మిలియన్ వ్యూస్‌ను, 9 లక్షల కామెంట్స్‌ను సాధించి సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. ఇంతకుముందు వ్యూస్ పరంగానే రికార్డులు చూసుకొనే ఫ్యాన్స్, ఇప్పుడు కామెంట్స్ పరంగా కూడా రికార్డుల కోసం తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో అటు వ్యూస్ పరంగా, ఇటు కామెంట్స్ పరంగా 'రామరాజు ఫర్ భీమ్' టీజర్‌ను దాటేసిన 'మాస్టర్ టీజర్'తో విజయ్ ఫ్యాన్స్ మిగతా స్టార్స్ ఫ్యాన్స్‌కు సవాలు విసిరారు.
![]() |
![]() |