![]() |
![]() |

కరోనా ఎఫెక్ట్ తో టాలీవుడ్ లో ఎన్నడూ లేని విధంగా.. ఈ ఏడాది సినిమాల సంఖ్యని 70లోపే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. వీటిలో 50 శాతం చిత్రాలు థియేటర్స్ లో సందడి చేస్తే.. మరో 50 శాతం ఓటీటీ, ఏటీటీ వేదికల్లో పలకరించాయి. అయితే విజయాల బాట పట్టిన సినిమాలు మాత్రం ఎప్పటిలాగే పరిమిత సంఖ్యలోనే ఉండిపోయాయి. ఇంతకీ.. 2020 హిట్స్ ఏంటో ఓ సారి పరిశీలిస్తే..
సరిలేరు నీకెవ్వరు: మహేష్ బాబు, రష్మిక జంటగా నటించిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలై వసూళ్ళ వర్షం కురిపించింది. మహేష్, రష్మిక, దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్ లో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిందీ సినిమా.
అల వైకుంఠపురములో: సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అల వైకుంఠపురములో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో మెమరబుల్ ఫిల్మ్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్ లోనూ రికార్డు స్థాయి వసూళ్ళు రాబట్టింది. బన్నీతో పాటు యూనిట్ లోని దాదాపు అందరికీ కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ అయింది.
భీష్మ: ట‌్రాక్ తప్పిన నితిన్ కెరీర్ ని మళ్ళీ పట్టాలెక్కించిన చిత్రంగా భీష్మని చెప్పుకోవాలి. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21 విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్.. 2020 హిట్ లిస్ట్ లో అవలీలగా చేరిపోయింది.
హిట్ - ద ఫస్ట్ కేస్: విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా నేచురల్ స్టార్ నాని నిర్మించిన హిట్ - ద ఫస్ట్ కేస్ చిత్రం.. ఫిబ్రవరి 28న విడుదలై ప్రాఫిటబుల్ వెంచర్ అనిపించుకుంది.
సోలో బ్రతుకే సో బెటర్: కరోనా ఎఫెక్ట్ తో మూతబడ్డ థియేటర్స్.. మళ్ళీ సోలో బ్రతుకే సో బెటర్ తో రీ-ఓపెన్ అయ్యాయి. 50 పర్సంట్ ఆక్యూపెన్సీతోనూ, మౌత్ టాక్ తోనూ ఈ సాయితేజ్ స్టారర్ సక్సెస్ ఫుల్ వెంచర్ అనిపించుకుంది.
పై చిత్రాలన్నీ థియేటర్స్ లో హిట్ మూవీస్ గా నిలవగా.. కృష్ణ అండ్ హిజ్ లీల, భానుమతి రామకృష్ణ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కలర్ ఫొటో, మిడిల్ క్లాస్ మెలోడీస్, డర్టీ హరి వంటి చిత్రాలు ఓటీటీ, ఏటీటీ ప్లాట్ ఫామ్స్ లో మురిపించాయి. మరో రకంగా 2020 హిట్స్ లో స్థానం దక్కించుకున్నాయి.
![]() |
![]() |