![]() |
![]() |

2020 క్యాలెండర్ ఇయర్ లో ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా అల వైకుంఠపురములో పాటలదే హవా. అంతలా.. తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు యువ సంగీత తరంగం తమన్. రాములో రాములా, సామజవరగమనా, బుట్టబొమ్మ.. ఈ మూడు పాటలైతే విజువల్ గానూ, లిరికల్ గానూ యూట్యూబ్ ముంగిట కొంగ్రొత్త రికార్డులు సొంతం చేసుకున్నాయి. అలా.. అల వైకుంఠపురములోతో తెలుగునాట సరికొత్త చరిత్రలో భాగమయ్యాడు తమన్. అలాగే ఏడాది చివరలో థియేటర్స్ లో సందడి చేసిన సోలో బ్రతుకే సో బెటర్ విజయంలోనూ తన వంతు పాత్ర పోషించాడు. పాటలు, నేపథ్య సంగీతం.. ఈ రెండు అంశాల్లోనూ మెప్పించాడు తమన్.
ఇక ఇదే క్యాలెండర్ ఇయర్ లో వచ్చిన డిస్కో రాజా, వి (నేపథ్య సంగీతం), మిస్ ఇండియా చిత్రాలు ఫలితాల పరంగా నిరాశపరిచినా.. తమన్ పనితనానికి మంచి మార్కులే పడ్డాయి. ఓవరాల్ గా.. విజయాలతోనూ, సంఖ్య పరంగానూ చూస్తే నిస్సందేహంగా మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్ గా తమన్ అనే చెప్పాలి. 2021లో వకీల్ సాబ్, సర్కారు వారి పాట, అయ్యప్పనుమ్ కోషియుమ్, బీబీ3 (బాలకృష్ణ కొత్త చిత్రం వర్కింగ్ టైటిల్), క్రాక్, బాక్సర్, టక్ జగదీష్.. ఇలా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో సందడి చేయనున్నాడు తమన్.
![]() |
![]() |