![]() |
![]() |

లఖ్‌నవ్‌లో 1980ల తొలినాళ్లలో చోటు చేసుకొన్న కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా రూపొంది, విజయం సాధించిన అజయ్ దేవ్‌గణ్ ఫిల్మ్ 'రైడ్' తెలుగులో రీమేక్ కాబోతోంది. ఈ మూవీని హరీశ్ శంకర్ డైరెక్ట్ చేయనున్నాడు. 'రైడ్' తెలుగు వెర్షన్‌కు సంబంధించిన కొన్ని అంశాలను ఫైనలైజ్ చేసుకోడానికి ఇటీవల ముంబై వెళ్లాడు హరీశ్. ఒరిజినల్‌ను నిర్మించిన పనోరమా స్టూడియోస్ అధినేత కుమార్ మంగత్ పాఠక్‌ను కలిశాడు. తెలుగు వెర్షన్‌కు కూడా ఆయనే నిర్మాత అని సమాచారం.
ఒరిజినల్‌లో అజయ్ దేవ్‌గణ్ చేసిన క్యారెక్టర్‌ను తెలుగులో ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్‌తో 'భవదీయుడు భగత్‌సింగ్' మూవీని హరీశ్ శంకర్ రూపొందిస్తున్నాడు. 'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు అసాధారణ స్థాయిలో ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ మూవీని నిర్మిస్తున్నారు.
తన యాటిట్యూడ్ కారణంగా తరచూ ట్రాన్స్‌ఫర్లకు గురవుతుండే పోలీస్ ఇన్‌స్పెక్టర్ అమయ్ పట్నాయక్‌గా అజయ్ దేవ్‌గణ్ నటించిన 'రైడ్' మూవీని రాజ్‌కుమార్ గుప్తా డైరెక్ట్ చేశాడు. ఇలియానా హీరోయిన్‌గా నటించింది.
![]() |
![]() |