Home  »  News  »  విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత ఎంత 'ఖుషి'గా ఉన్నారో!

Updated : May 16, 2022

 

స్టార్‌డ‌మ్ వ‌చ్చాక ఒక‌ ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ మూవీలో ఆయ‌న జోడీగా స‌మంత‌ కనిపించనుంది. 'మ‌జిలీ' డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బేన‌ర్‌పై వై. రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే కశ్మీర్‌లో ప్రారంభ‌మై, ప్రస్తుతం అక్కడే చిత్రీకరణ జరుపుకుంటోంది. 

తాజాగా ఈ సినిమాకు "ఖుషి" టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ లోగోతో పాటు విజయ్ దేవరకొండ, సమంత ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో ఈ జంట లవ్లీగా కనిపిస్తున్నారు. స‌మంత సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా పింక్ క‌ల‌ర్ శారీ, మ్యాచింగ్ బ్లౌజ్‌తో కూర్చొని వుండ‌గా, విజ‌య్ అల్ట్రా మోడ‌ర‌న్ డ్ర‌స్‌లో నోటిలో సిగ‌రెట్‌, క‌ళ్ల‌కు గాగుల్స్‌తో క‌నిపిస్తున్నాడు. పెళ్లిలో వ‌ధూవ‌రుల‌కు ముడివేసిన‌ట్లు, వారి డ్ర‌స్సులు ముడివేసి ఉన్నాయి.  

విజయ్, సమంత కెరీర్ లలో ఇదొక మెమొరబుల్ ఫిల్మ్ గా మిగులిపోతుందని సినిమా యూనిట్ చెబుతోంది. ప్రేమలో గెలిస్తే ఖుషి, ఆ ప్రేమను కుటుంబంతో పంచుకుంటే మరింత ఖుషి. జీవితంలో ఈ సంతోషాన్ని మించిన సంపద లేదు అన్నట్లు "ఖుషి" టైటిల్, ఫస్ట్ లుక్ డిజైన్ క్రియేటివ్ గా ఉండి ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 23న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఈ పోస్ట‌ర్‌ను షేర్ చేసిన స‌మంత‌, This Christmas- NewYears ❤️ An Explosion of Joy, laughter, happiness & Love. A Grand Family experience! #KUSHI . Telugu Tamil Kannada Malayalam. Dec 23 Worldwide Release! అంటూ రాసుకొచ్చింది.

కశ్మీర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ చేయనున్నారు. జ‌య‌రామ్‌, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ ఇత‌ర కీల‌క పాత్ర‌ధారులు.

న‌రేశ్ బాబు పి. ర‌చ‌నా స‌హ‌కారం అందిస్తోన్న ఈ చిత్రానికి హిషాబ్ అబ్దుల్ వాహ‌బ్ సంగీత ద‌ర్శ‌కుడిగా, జి. ముర‌ళి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ చేస్తోన్న ఈ మూవీకి పీట‌ర్ హెయిన్ స్టండ్ డైరెక్ట‌ర్‌. ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు వ‌హిస్తుండ‌టంతో పాటు క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను శివ నిర్వాణ స‌మ‌కూరుస్తున్నాడు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.