![]() |
![]() |

ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన `భీమ్లా నాయక్`తో చెప్పుకోదగ్గ విజయం అందుకున్నాడు దగ్గుబాటి స్టార్ రానా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటించిన సదరు యాక్షన్ డ్రామాలో డేనియల్ శేఖర్ గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించాడు రానా. కట్ చేస్తే.. త్వరలో ఈ టాలెంటెడ్ స్టార్ `విరాట పర్వం`తో పలకరించబోతున్నాడు. డాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన ఈ పిరియడ్ డ్రామా జూలై 1న తెరపైకి రాబోతోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో ఇదే జూలై 1న రానా బాబాయ్, విక్టరీ వెంకటేశ్ టైటిల్ రోల్ లో నటించిన `బ్రహ్మ పుత్రుడు` (1988) విడుదలై మంచి విజయం సాధించింది. ఆ చిత్రాన్ని నిర్మించిన సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ.. `విరాట పర్వం` నిర్మాణంలోనూ భాగం పంచుకోవడం విశేషమనే చెప్పాలి. మరి.. వెంకీ `సూర్యవంశం` (1998) రిలీజ్ డేట్ ఫిబ్రవరి 25ని టార్గెట్ చేసుకున్న `భీమ్లా నాయక్` ఎలాగైతే విజయం సాధించిందో.. అదే తరహాలో `బ్రహ్మ పుత్రుడు` విడుదల తేది జూలై 1ని లక్ష్యంగా చేసుకున్న `విరాట పర్వం` కూడా సక్సెస్ అవుతుందేమో చూడాలి.
కాగా, వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన `విరాట పర్వం`లో నందితా దాస్, ప్రియమణి, నివేదా పెతురాజ్, జరీనా వహబ్, ఈశ్వరీ రావ్, సాయి చంద్, నవీన్ చంద్ర ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
![]() |
![]() |