![]() |
![]() |

విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్ లో 11 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నుంచి విజయ్ ఫస్ట్ లుక్ రేపు(మే 16) విడుదల కానుంది.
'VD11' ఫస్ట్ లుక్ ని రేపు ఉదయం 9:30 కి విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. అందులో ఈ సినిమాకి స్టంట్ కొరియోగ్రాఫర్ గా పీటర్ హెయిన్ పని చేస్తున్నట్లు తెలియజేశారు. ఆ వీడియోలో పీటర్ కి శివ సీన్ వివరిస్తూ "ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. మంచు కొండల మధ్య ఉన్న హీరోయిన్ ని హీరో ఫస్ట్ టైమ్ చూస్తున్నప్పుడు స్మోక్ ఎఫెక్ట్ కావాలి. మణిరత్నం సినిమాలో లాగా ఉండాలి" అని చెప్పడంతో.. స్మోక్ ఎఫెక్ట్ కోసం పీటర్ బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. ఆ స్మోక్ లో నుంచి ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చింది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి హేశం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |