![]() |
![]() |

టాక్ తో సంబంధం లేకుండా 'సర్కారు వారి పాట' సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి షో నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి రెండో రోజు నుంచి కలెక్షన్స్ అంతగా రావని భావించారంతా. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ భారీ కలెక్షన్స్ తో సత్తా చాటుతోంది. మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.72 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ సినిమా నేడు ఆదివారం కావడంతో మరో 10-15 కోట్ల షేర్ రాబట్టే అవకాశముంది. అయితే రేపటి(సోమవారం) నుంచి ఈ సినిమా పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మే 12(గురువారం) విడుదలైన 'సర్కారు వారి పాట' వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 45.21 కోట్ల షేర్, రెండో రోజు 13 కోట్ల షేర్, మూడో రోజు 14.01 కోట్ల షేర్ రాబట్టింది. నాలుగో రోజు ఆదివారం కావడంతో ఈజీగా 85 కోట్ల షేర్ మార్క్ దాటే అవకాశముంది. అయితే నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ తర్వాత సోమవారం నుంచి ఈ సినిమాకి అసలు పరీక్ష ఎదురు కానుంది. వరల్డ్ వైడ్ గా 120 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ నాలుగు రోజులు ముగిశాక బ్రేక్ ఈవెన్ కి మరో 35 కోట్ల దూరంలో ఉండనుంది. ప్రస్తుతం థియేటర్స్ లో సినిమాల లైఫ్ బాగా తగ్గిపోయింది. పైగా డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాకి మొదటి వీకెండ్ తర్వాత పెద్దగా కలెక్షన్స్ వచ్చే అవకాశం లేదు. మరి టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబట్టి సత్తా చాటిన సర్కారు వారి పాట.. లాంగ్ రన్ లోనూ అదే స్థాయిలో సత్తా చాటుతుందేమో చూడాలి.
![]() |
![]() |