![]() |
![]() |

నటి మాధవీలత మరోసారి ఫైర్ బ్రాండ్ అవతారమెత్తారు. సోషల్ మీడియాలో తనను అసభ్యంగా ట్రోల్ చేస్తున్నవారిపై గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె, ఈరోజు మీడియాతో మాట్లాడారు. తనను చాలామంది బెదిరిస్తున్నారనీ, కానీ తానెవరికీ భయపడనని అన్నారు. తన ప్రాణాల మీదికొస్తే ఎవరినైనా చంపడానికి సిద్ధమేనని హెచ్చరించారు.
"సోషల్ మీడియాలో చాలాసార్లు పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతున్నారు. నామీద చాలా ట్రోలింగ్ చేస్తున్నారు. ఒక సినిమా అమ్మాయి అనంగానే తిరుగుబోతులు, పచ్చి బిచ్ అనే అభిప్రాయంతో ఉంటారు. వాళ్లు ఎంతసేపూ ఆడవాళ్ల బతుకుల మీద, ఆడవాళ్ల దేహాల మీద పడి డబ్బులు సంపాదించుకోవడమే. ఫలానా హీరోయిన్ ఫలానా చోట పట్టుబడింది, ఫలానా టీవీనటి ఇంకోచోట పట్టుబడింది అని చూపిస్తుంటారు." అని ఆమె దుయ్యబట్టారు.
తాను పాలిటిక్స్‌లో వచ్చిన దగ్గర్నుంచీ రకరకాల పార్టీలవాళ్లు.. టీఆర్ఎస్ అయితేనేమి, వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ అయితేనేమి టార్గెట్ చేయడం మొదలుపెట్టారని ఆమె ఆరోపించారు. "నేనెవడికీ భయపడే సమస్యే లేదు. సజ్జనార్ (సైబరాబాద్ పోలీస్ కమిషనర్) దగ్గర గన్ లైసెన్స్ కూడా తీసుకుంటాను. నా ప్రాణాల మీదికొస్తే, నేనెవడినైనా చంపడానికి సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే.. నన్ను చాలామంది బెదిరిస్తున్నారు." అని ఆమె చెప్పారు.
ఆంధ్రాలో హిందూ దేవాలయాలను పడగొడుతున్నారనీ, ఈ విషయం మీద ఓ హిందువుగా తాను మాట్లాడాననీ ఆమె అన్నారు. "నేను హిందువునని గొప్పగా చెప్పుకుంటా. ఎవడేం పీకుతాడో నేను కూడా చూస్తాను. వైసీపీ వాళ్ల ఎటాక్ ఎలా ఉందంటే.. రాడ్లు దింపుతాము, నువ్వు రోడ్డుమీద కనిపిస్తే పిచ్చకొట్టుడు కొడతాము, అంటున్నారు. వాళ్లేమనుకుంటున్నారో, వాళ్లెలా రాడ్లు దింపుతారో నేను కూడా చూడాలనుకుంటున్నాను." అని సవాల్ విసిరారు మాధవీలత.
![]() |
![]() |