![]() |
![]() |

ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నిన్నటి తరం కథానాయకుడు జగపతిబాబు.. ఇప్పుడు విలన్ గానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ఫుల్ బిజీగా మారిపోయారు. ఈ ఏడాదిలోనూ పలు ఆసక్తికరమైన పాత్రలతో జగ్గూభాయ్ సందడి చేయనున్నారు.
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి నెల జగపతిబాబుకి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే.. ఈ నెలలోనే ఆయన పుట్టినరోజు (ఫిబ్రవరి 12) వస్తుంది. అలాంటి బర్త్ డే మంత్ లో.. ఈ ఏడాది వారం గ్యాప్ లో రెండు ఆసక్తికరమైన పాత్రలతో పలకరించబోతున్నారు ఈ సీనియర్ స్టార్.
ఆ వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 12న అంటే తన పుట్టినరోజున FCUK(ఫాదర్ చిట్టి ఉమ కార్తిక్) విడుదల కాబోతోంది. ఇందులో కొత్త తరహా భూమికలో దర్శనమివ్వనున్నారు జగపతిబాబు. కట్ చేస్తే.. వారం రోజుల తరువాత అంటే ఫిబ్రవరి 19న పిట్టకథలు అనే ఆంథాలజీతో పలకరించబోతున్నారాయన. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానున్న ఈ ఆంథాలజీలో ఓ షార్ట్ ఫిల్మ్ కోసం ప్రధాన పాత్ర పోషించారు.
మరి.. బర్త్ డే మంత్ లో వారం రోజుల గ్యాప్ లో సందడి చేయనున్న జగ్గూభాయ్ కి.. ఆయా పాత్రలతో ఎలాంటి గుర్తింపు దక్కుతుందో చూడాలి.
![]() |
![]() |