![]() |
![]() |

ఇప్పుడు ప్రపంచంలో నలుమూలలు ఉన్న తెలుగు వాళ్ళందరిని జనవరి 12 కి ఉన్న స్పెషల్ ఏంటి అని అడిగితే అందరు టక్కున ఆ రోజు మహేష్ గుంటూరు కారం(guntur kaaram) రిలీజ్ అనే సమాధానం చెప్తారు. పైగా మహేష్ బాబు( mahesh babu) నుంచి సంవత్సరం గ్యాప్ తర్వాత మూవీ గుంటూరు కారం కావడంతో మహేష్ అభిమానుల హడావిడి కూడా మొదలయ్యింది. అలాగే రిలీజ్ టైం దగ్గరపడేకొద్దీ మేకర్స్ కూడా ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు.
గుంటూరు కారం మేకర్స్ తాజాగా ఆ మూవీలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేస్తున్న మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)కి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఇంకో ఎనిమిది రోజుల్లో రాబోతుందన్న ఆ పోస్టర్ లో ఠీవిగా కూర్చొని ఉన్న మహేష్ భుజాల మీద మీనాక్షి చేతులు వేసి ఉండటం ఆకట్టుకుంటుంది. అలాగే ఆ పోస్టర్ లో మహేష్ తనకి మాత్రమే సొంతం అని చెప్తున్నట్టుగా ఆమె లుక్ వుంది. ఈ మూవీలో మీనాక్షి క్యారక్టర్ పేరుని రాజి గా కూడా మేకర్స్ పరిచయం చేసారు.

జనవరి 12 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న గుంటూరు కారం మీద మహేష్ అభిమానుల్లోను, మూవీ లవర్స్ లోను భారీ అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్(trivikram) దర్శకత్వం లో వస్తున్న ఈ మూవీలో మహేష్ సరసన శ్రీలీల (sreeleela)మీనాక్షి చౌదరి లు హీరోయిన్లుగా చేస్తుండగా రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ (thaman)సంగీతాన్ని అందించగా హారిక &హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరించాడు.
![]() |
![]() |