![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ (RaviTeja) తాజా చిత్రం 'ఈగల్' (Eagle) సంక్రాంతి సీజన్ పై ఎప్పుడో కర్చీఫ్ వేసింది. అయితే ఈ సినిమా వాయిదా పడనుందని వార్తలు రావడం, వాటిని మేకర్స్ ఖండించడం కొద్దిరోజులుగా జరుగుతూ వస్తోంది. తాజాగా మరోసారి ఈగల్ మూవీ వాయిదా వార్తలు తెరపైకి వచ్చాయి.
ఈ సంక్రాంతికి 'ఈగల్'తో పాటు 'గుంటూరు కారం' (Guntur Kaaaram), 'హనుమాన్' (Hanuman), 'సైంధవ్' (Saindhav), 'నా సామి రంగ' (Naa Saami Ranga) సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. అయితే థ్రిల్లర్ జానర్ రవితేజకు అంతగా కలిసిరాని జానర్ కావడంతో.. మిగతా నాలుగు సినిమాలతో పోలిస్తే 'ఈగల్'పై పెద్దగా బజ్ లేదని, పైగా నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా ఇంకా పూర్తి కాలేదని, అందుకే ఈగల్ వాయిదా పడటం దాదాపు ఖాయమైందని ప్రచారం జరుగుతోంది. కొందరు డిస్ట్రిబ్యూటర్స్ సైతం వాయిదా ఖాయమని చెప్పినట్లు న్యూస్ వినిపిస్తోంది. కానీ మేకర్స్ మాత్రం మీ ప్రచారం మీది, మా ప్రచారం మాది అంటున్నారు.

'ఈగల్' చిత్రాన్ని నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తాజాగా మరోసారి విడుదల తేదీపై స్పష్టత ఇచ్చింది. "మొండి మోతుబరి మాస్ విధ్వంసానికి సిద్ధంగా ఉండండి" అంటూ 'ఈగల్' సినిమా జనవరి 13న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మరోసారి స్పష్టం చేసింది. అలాగే సెన్సార్ కూడా పూర్తయిందని, ఎటువంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికెట్ వచ్చిందని తెలిపింది.
ఈగల్ వాయిదా అని వార్తలు రావడం, మేకర్స్ తగ్గేదేలే అనడం.. కొద్దిరోజులుగా జరుగుతూ వస్తున్న తతంగం. మరి దీనికి త్వరలోనే ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.
![]() |
![]() |