![]() |
![]() |
.webp)
చాలారోజుల తర్వాత మహేష్ బాబు(Mahesh Babu) నుంచి వస్తున్న అసలుసిసలైన మాస్ ఫిల్మ్ 'గుంటూరు కారం'(Guntur Kaaram). త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసింది.
నైజాంలో రూ.42 కోట్లు, సీడెడ్ లో రూ.13.75 కోట్లు, ఆంధ్రాలో రూ.47.25 కోట్లు బిజినెస్ చేసిన గుంటూరు కారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.103 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.9 కోట్లు, ఓవర్సీస్ రూ.20 కోట్లు కలిపి.. వరల్డ్ వైడ్ గా రూ.132 కోట్ల బిజినెస్ చేసినట్లు అంచనా. అంటే గుంటూరు కారం మూవీ హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే రూ.132 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ పై ఉన్న క్రేజ్, సంక్రాంతి రిలీజ్ కావడంతో.. పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.
థియేట్రికల్ బిజినెస్ పరంగా మహేష్ కెరీర్ లో రూ.124 కోట్లతో 'స్పైడర్' టాప్ లో ఉండగా.. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి గుంటూరు కారం చేరింది.
'గుంటూరు కారం' థియేట్రికల్ బిజినెస్:
నైజాం: రూ.42 కోట్లు
సీడెడ్ : రూ.13.75 కోట్లు
ఆంధ్ర: రూ.47.25 కోట్లు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి: రూ.103 కోట్లు
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: రూ.9 కోట్లు
ఓవర్సీస్: రూ.20 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ బిజినెస్: రూ.132 కోట్లు
![]() |
![]() |