![]() |
![]() |

సినిమా హీరోలు కూడా సాధారణ మనుషులే. వారికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. వారికీ సంతోషం, బాధ ఉంటాయి. వారి జీవితాల్లో విషాదం జరిగినప్పుడు ఆ బాధని మనసులో దాచుకోలేక.. ఒక్కోసారి అభిమానుల సమక్షంలో తమకి తెలియకుండానే ఎమోషనల్ అవుతుంటారు.
తన తండ్రి హరికృష్ణ మరణం తర్వాత జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) నుండి వచ్చిన చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. హరికృష్ణ మరణించిన కొద్ది రోజులకే ఈ సినిమా విడుదలైంది. తండ్రిపోయి ఎంతో బాధలో ఉన్న ఎన్టీఆర్.. ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ 'నాకన్నీ మీరే' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ సమయంలో తారక్ స్పీచ్ అభిమానుల చేత కంటతడి పెట్టించింది.
ఇప్పుడు 'గుంటూరు కారం'(Guntur Kaaram) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు(Mahesh Babu) కూడా తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకొని కంటతడి పెట్టుకున్నాడు. "ఈసారి మన మధ్యన నాన్నగారు లేకపోవడం వల్లనో ఏమో కొత్తగా అనిపిస్తుంది. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి, కలెక్షన్ల గురించి చెప్తుంటే ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తూ ఉండేవాడిని. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. ఇకనుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్నీ. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడూ నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అంటూ అభిమానులను ఉద్దేశించి మహేష్ అన్న మాటలు కదిలిస్తున్నాయి.
![]() |
![]() |