![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' సినిమాతో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) రేంజ్ పెరిగిపోయింది. అప్పటిదాకా యంగ్ టైగర్ గా సౌత్ లో మంచి గుర్తింపు ఉన్న ఎన్టీఆర్.. 'ఆర్ఆర్ఆర్' తర్వాత పాన్ ఇండియా రేంజ్ లోనే కాదు, ఏకంగా గ్లోబల్ లెవెల్ లో పేరు తెచ్చుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు తారక్ అడుగులు పడుతున్నాయి.
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'దేవర'(Devara). కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ గ్లింప్స్(Devara Glimpse) కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయనే పేరు తెచ్చుకుంది. 'ఆర్ఆర్ఆర్'తో తనకి వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ భారీ అడుగులు వేస్తున్నాడని గ్లింప్స్ ని బట్టి అర్థమైంది.

ఇక ఈ గ్లింప్స్ లో 'మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్' అని కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్ ని అభిమానులు కెరీర్ స్టార్టింగ్ నుంచి యంగ్ టైగర్ అని పిలుస్తుంటారు. స్క్రీన్ మీద కూడా యంగ్ టైగర్ అనే ట్యాగ్ తోనే ఎన్టీఆర్ పేరు పడుతూ వచ్చింది. అయితే తారక్ కి మాస్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. పైగా 'ఆర్ఆర్ఆర్'తో ఆయన రేంజ్ పెరిగింది. అభిమానులు కూడా కొంతకాలంగా ఎన్టీఆర్ ని మ్యాన్ ఆఫ్ మాసెస్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు దేవర టీం కూడా యంగ్ టైగర్ ట్యాగ్ కి బదులుగా, మ్యాన్ ఆఫ్ మాసెస్ ట్యాగ్ ని అఫీషియల్ గా ఉపయోగించారు. ఇక 'మ్యాన్ ఆఫ్ మాసెస్'గా ఎన్టీఆర్ మునుముందు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
![]() |
![]() |