![]() |
![]() |

మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ (ram charan)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. సినిమా సినిమాకి తన అభిమాన గణాన్నిపెంచుకుంటుపోతున్న చరణ్ తాజాగా తన అభిమానులకి ఒక బంపర్ ఆఫర్ ప్రకటించాడు.అఫ్ కోర్స్ తన అభిమానుల వరకు మాత్రమే కాదు అశేష తెలుగు ప్రజల కోసం చరణ్ బంపర్ ఆఫర్ ప్రకటించాడు.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ టీ 10 2023 పేరిట ఒక కొత్త క్రికెట్ లీగ్ ప్రారంభం అవుతుంది. ఈ లీగ్ లో పాల్గొనే హైదరాబాద్ క్రికెట్ టీంని చరణ్ కొనుగోలు చేసాడు. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా చరణే స్వయంగా వెల్లడి చేసాడు. ఇప్పుడు ఈ హైదరాబాద్ టీం కి తనొక్కడే కాకుండా వేరే వాళ్ళు కూడా ఓనర్స్ గా ఉండవచ్చు.అంటే చరణ్ తో పాటు హైదరాబాద్ జట్టుకి సహా యజమానులుగా ఉంటారు.ఎవరైనా సరే లీగ్ లో భాగస్వామ్యం అవ్వాలంటే ఐఎస్ పిఎల్ - టి 10 . కామ్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరు ఎక్కువ బిడ్ వేస్తే వాళ్ళు చరణ్ తో పాటు హైదరాబాద్ జట్టుకి ఓనర్స్ గా ఉంటారు గల్లీ క్రికెట్ ని వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పాటయిన
గల్లీ క్రికెట్ ని వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పాటయిన ఐఎస్ పిఎల్ - టి 10 లీగ్ లోని హైదరాబాద్ జట్టుని చరణ్ కొనుగోలు చెయ్యడం వల్ల హైదరాబాద్ గల్లీ క్రికెట్ కి పూర్వ వైభవం వస్తుందని అందరు అభిప్రాయపడుతున్నారు.అలాగే తన కొత్త సినిమా టైటిల్ గేమ్ చేంజర్ కి తగ్గట్టే చరణ్ నిజ జీవితంలో కూడా గేమ్ చేంజర్ అని కూడా అంటున్నారు.
![]() |
![]() |