![]() |
![]() |

2009లో సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన శృతిహాసన్ చాలా తక్కువ టైమ్‌లో మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. గబ్బర్ సింగ్, రేసుగుర్రం, ఎవడు, బలుపు, ప్రేమమ్, శ్రీమంతుడు వంటి సూపర్‌హిట్ సినిమాల్లో నటించిన శృతి ఆ తర్వాత కొన్నాళ్లకు చేసిన కాటమరాయుడుతో కొన్నాళ్ళు తెలుగులో గ్యాప్ తీసుకొని మళ్ళీ క్రాక్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ గ్యాప్‌లో తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. మొత్తానికి శృతిహాసన్ లక్కీ గర్ల్‌గా టాలీవుడ్‌లో పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత చేసిన వకీల్‌సాబ్ కూడా హిట్ అవ్వడం ఆమెకు మరింత ప్లస్ అయ్యింది.
ఇక 2023కి వస్తే ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు సూపర్‌హిట్ అవ్వడంతో శృతి సినిమాకు తప్పకుండా ప్లస్ అవుతుందన్న నమ్మకం నిర్మాతల్లో బాగా పెరిగింది. తాజాగా విడుదలైన ప్రభాస్ సినిమా ‘సలార్’ దానికి మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తూ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా దూసుకెళ్తుండడంతో టాలీవుడ్‌లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది శృతి. ఎప్పుడూ ఏదో ఒక భాషలో సినిమాలు చేస్తూ బిజీగానే ఉండే శృతి ఇటీవల విడుదలైన హాయ్ నాన్న చిత్రంలో కూడా గెస్ట్‌గా కనిపించింది. ప్రస్తుతం అడివి శేష్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘డకాయిట్’ చిత్రంలో నటిస్తోంది. ఇది కాక ‘ది ఐ’ అనే ఇంగ్లీష్ సినిమా కూడా చేస్తోంది.
![]() |
![]() |