![]() |
![]() |

నూనూగు మీసాల వయసులోనే తెలుగు సినిమా పరిశ్రమలో సరికొత్త రికార్డులని సృష్టించిన ఘనత జూనియర్ ఎన్టీఆర్ సొంతం. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చి నేటి వరకు కూడా తన నటనతో కొన్ని లక్షల మంది అభిమానులని సంపాదించుకున్నాడు. సినిమాలే కాకుండా వ్యాపార ప్రకటనలు కూడా చేస్తు తన అభిమానుల్లో జోష్ నింపుతున్న ఎన్టీఆర్ కి తాజాగా ఒక అరుదైన గౌరవం దక్కింది.
ఆసియాలో ఉన్న ప్రతిష్టాత్మకమైన మ్యాగజైన్స్ లో ఏషియన్ వీక్లీ కూడా ఒకటి. తాజాగా ఈ మ్యాగజైన్ ఆసియాలోనే టాప్ 50 నటుల జాబితాని ప్రకటించింది. ఇప్పుడు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ స్థానం సంపాదించాడు. ఈస్టర్న్ ఐ 2023 అనే పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో ఎన్టీఆర్ 25 వ స్థానంలో నిలిచాడు. ఇప్పుడు ఈ వార్తలతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
తెలుగు చిత్ర సీమకి సంబంధించి కేవలం ఎన్టీఆర్ నే ఆసియా లో ఉన్న టాప్ నటుల జాబితాలో నిలవడం పట్ల ఎన్టీఆర్ నటనకి అమరత్వం ఉంటుందనే విషయం మరో సారి రుజవయ్యిందని . కూడా అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర తో పాటు బాలీవుడ్ లో హృతిక్ తో కలిసి వార్ 2 సినిమాల్లో నటిస్తున్నాడు.
![]() |
![]() |