![]() |
![]() |
.webp)
ఒక సినిమా సూపర్‌హిట్ అయ్యిందంటే ఆ హీరోను డైరెక్టర్ బాగా వాడుకున్నాడని, అతన్నుంచి తనకు కావాల్సిన ఔట్‌పుట్‌ను బాగా తీసుకున్నాడని అప్రిషియేట్ చేస్తుంటారు. ఈ విషయంలో ప్రశాంత్ నీల్‌కి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు ఇవ్వొచ్చు. ప్రభాస్ లాంటి కటౌట్‌ని వాడుకోవాలంటే ఆ డైరెక్టర్ ఎంతో టాటెంటెడ్ అయి ఉండాలి. అతని హీరోయిజాన్ని ఎలా ఎలివేట్ చెయ్యాలి, ఎలా చేస్తే ఫ్యాన్స్‌కి పూనకాలు వస్తాయి అనే విషయాన్ని ప్రశాంత్‌నీల్ బాగా పట్టుకున్నాడు. అందుకే ‘సలార్’లో ప్రభాస్ హీరోయిజానికి అంత అప్రిషియేషన్ వస్తోంది. కథ, కథనాలు ఎలా ఉన్నా.. ప్రభాస్‌ని ఓ రేంజ్‌లో చూపించడంలో ప్రశాంత్ టాలెంట్‌ని మెచ్చుకోవాల్సిందే. ‘సలార్’ గురించి, ప్రభాస్ గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతూ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు.
అందరిదీ ఒక దారైతే కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మది మరో దారి కదా. అందరి కంటే భిన్నంగా కామెంట్స్ పెట్టాలని డిసైడ్ అయినట్టున్నాడు. అందుకే ‘సలార్’ సక్సెస్‌కి పవన్‌కల్యాణ్‌ని లింక్ చేస్తూ ఓ విచిత్రమైన కామెంట్ పెట్టాడు. ఇప్పుడది నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఆ కామెంట్ ఎలా ఉందంటే..
ప్రభాస్‌ని అతని కటౌట్‌కి తగ్గట్టు వాడుకున్నవారు రాజమౌళి, ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్‌ని బాగా వాడుకున్న డైరెక్టర్లు వి.వి.వినాయక్, సుకుమార్. మహేష్‌బాబుని బాగా వాడుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఇక పవన్‌కళ్యాణ్ విషయానికి వస్తే.. అతన్ని ఓ రేంజ్‌లో వాడుకున్నది మాత్రం మాజీ సిఎం చంద్రబాబునాయుడు అని ట్వీట్ చేశాడు వర్మ. ప్రస్తుతం నడుస్తున్న పొలిటికల్ గేమ్‌లో పవన్‌కళ్యాణ్‌ని చంద్రబాబు బాగా వాడుకుంటున్నాడనేది ఆర్జీవీ అభిప్రాయం. పవన్‌ని వాడుకోవడంలో చంద్రబాబుతో ఏ డైరెక్టర్ కూడా పోటీ పడలేరని సెటైర్ వేశారు.
ఆర్జీవీ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆంద్రప్రదేశ్‌లో పవన్‌కల్యాణ్ ఎక్కడ మీటింగ్ పెట్టినా ‘సీఎం.. సీఎం’ అంటూ పవన్‌కళ్యాణ్‌ని ఉద్దేశించి కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల నారా లోకేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘తెలుగుదేశం, జనసేన కూటమి ఎన్నికల్లో విజయం సాధిస్తే సీఎం ఎవరు అవుతారు?’ అని అడిగిన ప్రశ్నకు.. తడుముకోకుండా తన తండ్రి చంద్రబాబు సిఎం అవుతారని చెప్పారు. లోకేష్ సమాధానాన్ని, ఆర్జీవీ ట్వీట్‌ను లింక్ చేస్తూ ఇప్పటికైనా పవన్ ఫ్యాన్స్‌కి అర్థమైందా? చంద్రబాబు వాడకం ఎలా ఉంటుందో.. అని నెటిజన్లు పవన్‌కళ్యాణ్‌పై సెటైర్లు విసురుతున్నారు.
![]() |
![]() |