![]() |
![]() |

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమల కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతున్న చిత్రం బబుల్ గమ్ ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ తో ప్రేక్షకుల్లో మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీలో రోషన్ సరసన నూతన కధానాయిక మానస చౌదరి హీరోయిన్ గా చేస్తుంది. ఈ నెల 29 న విడుదల అవుతున్న ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
బబుల్ గమ్ మూవీ లేటెస్ట్ గా సెన్సార్ కి వెళ్ళింది. సినిమా మొత్తం చూసిన సెన్సార్ వాళ్ళు బబుల్ గమ్ కి A సర్టిఫికెట్ ని ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న చాలా మంది మూవీ జనాల్లోకి వెళ్ళడానికి ట్రైలర్ లోనే సినిమాలో ఉన్న ముద్దు సీన్స్ అన్ని చూపించారనుకుంటే ఇప్పుడు సినిమాలో ఎన్ని ముద్దు సీన్స్ ఉండుంటే సెన్సార్ A సర్టిఫికెట్ ఇచ్చి ఉంటుందని అనుకుంటున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ మహేశ్వరి మూవీస్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ మూవీకి రవికాంత్ పేరపు దర్శకత్వాన్ని వహించగా శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు.
![]() |
![]() |