![]() |
![]() |

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చరిత్రలో నిలిచిపోతుందన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన నటించిన 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో విడుదల కార్యక్రమం తిరుపతిలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా అభిమానులనుద్దేశించి మాట్లాడారు బాలయ్య. తెలుగుజాతి దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశం మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యం కింద పాలించిన గొప్ప తెలుగు చక్రవర్తి గురించి మనకు సరిగ్గా తెలియకపోవడం దారుణమన్నారు. వందో సినిమా కోసం చాలా కథలు విని అంగీకరించని దశలో ఆయన కథ చెప్పడం, ఆ కథను తాను అంగీకరించడం జరిగిందని అన్నారు. నటులను పిండి మంచి నటనను రాబట్టే వ్యక్తి క్రిష్ అన్నారు. తన తల్లిదండ్రుల దీవెనల వల్లే నటసింహమని..ఎమ్మెల్యే అని పిలిపించుకుంటున్నానని అన్నారు.
![]() |
![]() |