![]() |
![]() |

నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో విడుదల కార్యక్రమం తిరుపతిలో అట్టహాసంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు మాటలు రాసిన సాయి మాధవ్ బాలయ్య గురించి మాట్లాడుతూ..43 ఏళ్లుగా ప్రేక్షకులని అలరిస్తోన్న బాలకృష్ణ ఇప్పటికీ కొత్త 2000 రూపాయల నోటులా తళతళలాడుతూ అభిమానులని అలరిస్తున్నారని సాయి వ్యాఖ్యానించారు. గర్జించే సింహానికి మాటలు రాయడమంటే మాటలా..? ఎన్నో ఏళ్లుగా బాలకృష్ణ సినిమాలు చూస్తూ ఆనందిస్తూ వస్తున్నానని అన్నారు. క్రిష్ నాకు రచయితగా పునర్జన్మ ఇచ్చారని సాయి అన్నారు. నందమూరి బాలకృష్ణతో దర్శకుడు క్రిష్ కలిస్తే ఆ సినిమా అద్బుతంగా ఉంటుందని చెప్పారు.
![]() |
![]() |