![]() |
![]() |
.jpg)
తిరుపతిలో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఆడియో వేడుక కార్యక్రమానికి విచ్చేసిన బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్ హేమామాలిని నమో వెంకటేశాయ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తన సినీ జీవితం ఎన్టీఆర్ అడుగుజాడలోనే ప్రారంభమైందన్నారు. ఆయన నటించిన పాండవ వనవాసంలో తాను తొలిసారి నటించానని, అందులో చిన్న పాత్ర పోషించానని అన్నారు. ఈ సినిమా ద్వారా బాలకృష్ణతో నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఆయన వందో సినిమాలో నటించడం మరింత ఆనందంగా ఉందని, ఈ సినిమా హిట్ కావాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
![]() |
![]() |