![]() |
![]() |

గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో విడుదల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..యాంకర్ సుమపై ప్రశంసల జల్లు కురిపించారు. సుమను రోజూ చూసినా బోర్ కొట్టదు. అంతలా అందరిని ఆకట్టుకుంటోంది. తెలుగమ్మాయి కాకపోయినా తన కట్టు, బొట్టు, మాట తీరుతో ఎప్పటికప్పుడు మనకందరికీ తెలుగు నేర్పేలా తెలుగును గొప్పగా మాట్లాడుతుందని ఆయన కితాబునిచ్చారు. తిరుపతి రావడానికి ప్రధాన కారణం ఈ సినిమా నేపథ్యం, దీని గొప్పతనమని అయన అన్నారు. బాలకృష్ణతో తన అనుబంధం వేరని ఆయన అన్నారు. తెలుగువారి కీర్తి దశదిశలా వ్యాపింపజేసిన గొప్ప వ్యక్తి నందమూరి తారకరామారావు అని అన్నారు. తరాలుగా మనకు అందించిన వారసత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సినిమాను వినోదం కోసం తీస్తారు..కానీ సినిమాను చరిత్రగా తెలిపే విధంగా తీయడం గొప్పవిషయమని ఆయన అన్నారు.
![]() |
![]() |