![]() |
![]() |

కథానాయికల విషయంలో విక్టరీ వెంకటేష్ శైలి మారింది. 'దృశ్యం', 'గోపాల గోపాల', 'బాబు బంగారం'.. ఇలా ఒక దశలో తన వరుస చిత్రాల కోసం రిపీట్ కాంబినేషన్ల పైనే ఫోకస్ పెట్టారు. 'దృశ్యం'లో మీనా, 'గోపాల గోపాల'లో శ్రియ, 'బాబు బంగారం'లో నయనతార.. ఇలా అప్పటికే వెంకీతో ఆడిపాడిన నాయికలే సందడి చేశారు.
అయితే 'గురు' నుంచి వెంకీ చూపు ఫ్రెష్ జోడీలవైపే ఉంది. 'గురు'లో రితికా సింగ్ తొలిసారిగా ఈ దగ్గుబాటి స్టార్ తో జట్టుకడితే.. 'ఎఫ్ 2'లో తమన్నా భాటియా ఫస్ట్ టైమ్ విక్టరీ స్టార్ తో పెయిర్ అప్ అయ్యారు. ఇక 'వెంకీ మామ'లో నటించిన పాయల్ రాజ్ పుత్ కూడా ఆయనకు తాజా జోడీనే. ఈ వరుసలోనే.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 'నారప్ప' కోసం ప్రియమణి మొదటిసారిగా వెంకీకి జంటగా నటిస్తున్నారు. మరి.. ఇటీవల కాలంలో వెంకీకి ఫ్రెష్ కాంబినేషన్స్ అచ్చొస్తున్న నేపథ్యంలో 'నారప్ప'కి కూడా ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో చూడాలి.
కాగా, ఇటీవలే మళ్ళీ పట్టాలెక్కిన 'నారప్ప'.. 2021 ఆరంభంలో థియేటర్లలో సందడి చేయనుంది.
.jpg)
![]() |
![]() |