![]() |
![]() |
.jpg)
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ న్యూస్ నెట్వర్క్‌లో పని చేసే ఫిల్మ్ క్రిటిక్ రాజీవ్ మసంద్‌కి ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంగనా రనౌత్ తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో మహేష్ భట్, కరణ్ జోహార్, ఆదిత్యా చోప్రా సహా రాజీవ్ మసంద్‌కి సైతం సమన్లు జారీ చేయాలని పేర్కొన్న తరవాత ఆయనకు నోటీసులు వెళ్లడం గమనార్హం.
'మీ టూ' ఉద్యమ సమయంలో సుశాంత్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ రాజీవ్ మసంద్ ఒక ఆర్టికల్ రాశారు. అలాగే, మరో కథనంలో సుశాంత్‌ను ఇన్‌సెక్యూరిటీ ఉన్న నటుడిగా రాశారు. సుశాంత్ మరణం తరవాత రాజీవ్ మసంద్ ఆర్టికల్స్ నెట్‌లో వైరల్ అయ్యాయి. అలాగే, ఆయనను ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. త్వరలో విచారించనున్నారని సమాచారం.
ఇటీవల యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్యా చోప్రాను పోలీసులు విచారించారు. సుశాంత్ హీరోగా శేఖర్ కపూర్ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ 'పాని' సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకుంది. చివరి నిమిషంలో ఆ సినిమాను క్యాన్సిల్ చేశారు. దర్శకుడితో అభిప్రాయబేధాల కారణంగా సినిమా క్యాన్సిల్ చేశామని, సుశాంత్ కారణం కాదని ఆదిత్యా చోప్రా పోలీసులకు తెలిపినట్టు సమాచారం. ఇప్పటివరకు ఈ కేసులో 35మందిని పోలీసులు విచారించారట.
![]() |
![]() |