![]() |
![]() |
.jpg)
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నాయి. ఆర్జీవీ ట్విట్టర్ హ్యాండిల్ కింద రిప్లైస్ చూస్తే ఆ సంగతి తెలుస్తుంది. అలాగే, వర్మ మీద సెటైరికల్ సినిమా ప్రకటనలు చూసినా ఆ విషయం అర్థమవుతుంది. పవన్ కల్యాణ్‌ను కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' తెరకెక్కిస్తున్నారు. దానికి కౌంటర్ ఎటాక్‌గా 'పరాన్నజీవి', 'పార్న్ జీవి', 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ టాలీవుడ్: ప్లాప్ డైరెక్టర్' వస్తున్నాయి. అయితే... వర్మ 'పవర్ స్టార్' మాత్రం వార్తల్లో నిలుస్తూ ఉంది.
'పవర్ స్టార్'లో 'గడ్డి తింటావా' పాట విడుదలైన 24 గంటలు గడిచాయి. ఇప్పటికి పాటకు 1.6 మిలియన్స్‌కి పైగా వ్యూస్ వచ్చాయి. అలాగని, పాట హిట్ అనుకోవడానికి లేదు. ఆ పాటకు 72,000 లైక్స్ వస్తే... 56,000లకు పైగా డిస్ లైక్స్ వచ్చాయి. దీనిబట్టి పవన్ ఫ్యాన్స్ ఎంత కోపంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ లైకులను బట్టి పవన్ ఫ్యాన్స్ కంటే వర్మ ఫ్యాన్స్ ఎక్కువ అనుకోవడానికి లేదు. పవన్ మీద ఉన్న కోపంతో యాంటీ ఫ్యాన్స్ వర్మకు సపోర్ట్ చేస్తున్నారంతే.
![]() |
![]() |