![]() |
![]() |

సినిమాలపైనే కాకుండా సోషల్ ఇష్యూస్‌పైనా తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసే టాలీవుడ్ తారల్లో పూనమ్ కౌర్ ముందు వరుసలో ఉంటుంది. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటాన్ని సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతూ వస్తోంది పూనమ్. హైదరాబాద్‌లో పుట్టి పెరిగినప్పటికీ ఆమెది పంజాబీ కుటుంబం. కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతుల్లో ఎక్కువమంది పంజాబీలే.
లేటెస్ట్‌గా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆమె షేర్ చేసిన పోస్టులు అందరి దృష్టినీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. రైతుల మాదిరిగా తలపాగా చుట్టిన దివంగత నేతలు నందమూరి తారకరామారావు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఫొటోలను షేర్ చేసిన ఆమె, వాటికి "లీడర్స్ విత్ కంపాషన్.. ఫార్మర్స్ మిస్ యూ" అంటూ క్యాప్షన్ రాసింది. దాంతో పాటు అనేక రెడ్ హార్ట్ ఎమోజీలను జోడించింది. ఈ పోస్ట్ నెటిజన్లను బాగా ఆకర్షించింది. దాంతో వారు ఆ పోస్ట్‌ను షేర్ చేస్తూ దాన్ని వైరల్ చేశారు. ఆ పోస్ట్ తర్వాత మరో పోస్ట్ కూడా పెట్టింది పూనమ్.
ఫేమస్ పొలిటికల్ లీడర్లు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, యోగి ఆదిత్యనాథ్, మన్మోహన్ సింగ్, అమరీందర్ సింగ్, రాజ్‌నాథ్ సింగ్ పేర్లను తన పోస్ట్‌లో ప్రస్తావించిన ఆమె, రాజకీయాలను పక్కనపెట్టి రైతుల సమస్యను పరిష్కరించడానికి వాళ్లందరూ కలవాలని కోరింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ప్రస్తావించిన ఆమె, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహనరెడ్డి పేరును ఉపేక్షించింది. అసలు.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొలిటికల్ లీడర్ల ఎవరి పేర్లనూ ఆమె తన పోస్ట్‌లో చేర్చలేదు. ఆఖరుకి తను ఎంతగానో అభిమానించే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరును కూడా పూనమ్ పక్కన పెట్టేయడం గమనార్హం.

![]() |
![]() |