![]() |
![]() |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పటివరకు 9 సినిమాల్లో కథానాయకుడిగా సందడి చేశాడు. వీటిలో 4 చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఆ సినిమాలే.. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. తన కెరీర్ లో ఇప్పటివరకు హ్యాట్రిక్ హిట్ నమోదు కాలేదు. ఫిదా, తొలిప్రేమ రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న వరుణ్.. ఆపై అంతరిక్షం 9000 కె.ఎం.పి.హెచ్ తో అనూహ్య పరాజయం చూశాడు. అయితే, ఆ తరువాత ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ తో మళ్ళీ రెండు వరుస విజయాలను చూశాడు. ఈ నేపథ్యంలో.. తన అప్ కమింగ్ ఫిల్మ్ గనితో అయినా వరుణ్ హ్యాట్రిక్ హిట్ ని నమోదు చేసుకుంటాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆరంభం నుంచి పాజిటివ్ వైబ్స్ తోనే వార్తల్లో నిలుస్తున్న గని.. వరుణ్ కి కెరీర్ లో తొలి హ్యాట్రిక్ అంకాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తుందేమో చూడాలి.
కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా.. జూలై 30న థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |