![]() |
![]() |

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ కరోనా నుంచి కోలుకున్నారు. నెల రోజులుగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయనకు తాజా టెస్ట్‌లో నెగటివ్ రావడంతో పాటు అస్వస్థత నుంచి కోలుకోవడంతో సోమవారం సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లే ముందు హాస్పిటల్ సిబ్బందితో ఆయన ఫొటో దిగారు. ఈ సందర్భంగా వారందరికీ ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
క్లిష్ట పరిస్థితుల్లో కరోనాతో పోరాటం చేస్తున్న తన భర్తను ప్రాణాపాయం నుంచి రక్షించిన హాస్పిటల్ వైద్య బృందానికీ, అక్కడి సిబ్బందికీ జీవితా రాజశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు. నెలరోజుల పాటు ఆస్పత్రి సిబ్బంది తమను కుటుంబసభ్యుల్లా చూసుకున్నారని తెలిపిన జీవిత రాజశేఖర్ ... అభిమానులు, కుటుంబ సన్నిహితుల ప్రార్థనలు ఫలించి రాజశేఖర్ కోలుకున్నారని జీవిత సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆయనను జీవిత, ఇద్దరు కుమార్తెలు శివాని, శివాత్మిక తమ ఇంటికి తీసుకువెళ్లారు. కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ రాజశేఖర్ బాగా నీరసంగా కనిపిస్తున్నారు.


![]() |
![]() |