![]() |
![]() |

`అందాల రాక్షసి`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ఉత్తరాది భామ లావణ్య త్రిపాఠి. కెరీర్ ఆరంభంలో వరుస విజయాలు చూసిన ఈ ముద్దుగుమ్మ.. తరువాత కాస్త ట్రాక్ తప్పినా.. మళ్ళీ ఇప్పుడిప్పుడే తన ఖాతాలో విజయాలు వేసుకుంటోంది.
రెండు వారాల క్రితం స్పోర్ట్స్ డ్రామా `ఏ1 ఎక్స్ ప్రెస్`తో పలకరించిన లావణ్య.. ఈ శుక్రవారం (మార్చి 19) `చావు కబురు చల్లగా`తో సందడి చేయనుంది. `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ కథానాయకుడిగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో వితంతువు పాత్రలో కనిపించనుంది లావణ్య.
ఇదిలా ఉంటే.. తాజాగా లావణ్య తెలుగులో ఓ థ్రిల్లర్ మూవీకి ఓకే చెప్పింది. ఇందులో ఇదివరకెన్నడు దర్శనమివ్వని పాత్రలో నటించబోతోందట. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పుకొచ్చింది. మరి.. ఈ థ్రిల్లర్ మూవీ లావణ్య త్రిపాఠి కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి. కాగా, ఓ తమిళ చిత్రంలోనూ నాయికగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మిస్ త్రిపాఠి. `బ్రహ్మన్`, `మాయావన్` తరువాత లావణ్య చేయబోతున్న కోలీవుడ్ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.
![]() |
![]() |