![]() |
![]() |

పెళ్లి సంబంధాలు తెచ్చేవాళ్లను మన వాడుక భాషలో పెళ్లిళ్ల పేరయ్య అంటుంటాం. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన మెగా ఫ్యామిలీకి సంబంధించి అలాంటి పాత్రనే పోషిస్తున్నారని ఫిల్మ్‌నగర్ జనాలు అనుకుంటున్నారు. ఇటీవల ఆయన పెద్ద తమ్ముడు నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి చైతన్యతో జరిగిన విషయం తెలిసిందే. ఆ సంబంధం కుదర్చింది చిరంజీవే. ఇప్పుడు ఆయన దృష్టి తన మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ మీద పడిందని వినికిడి.
ఇప్పటికే సాయిధరమ్ కోసం ఆయన సంబంధం తెచ్చారనీ, సుప్రీమ్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే మిగిలిందనీ అంటున్నారు. అతను ఓకే అంటే 2020లోనే అతని పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయంట. చిరంజీవి చెల్లెలు విజయదుర్గ ఇద్దరు కొడుకుల్లో సాయిధరమ్ పెద్దవాడు. చిన్నవాడు వైష్ణవ్‌తేజ్ కూడా హీరోగా 'ఉప్పెన' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా నాగబాబు కొడుకు వరుణ్‌తేజ్ పెళ్లి విషయంలోనూ చిరంజీవి శ్రద్ధ చూపిస్తున్నారంట. 2021లో వరుణ్ పెళ్లి చేసుకొనే అవకాశాలున్నాయి. అతనికి కూడా మెగాస్టారే సంబంధం చూస్తారని ఫిల్మ్‌నగర్ వాసులు అనుకుంటున్నారు.
ఇప్పటికైతే నిహారిక పెళ్లికి పెద్దగా వ్యవహరించిన చిరంజీవి, ఇప్పుడు సాయిధరమ్ విషయంలోనూ అదే పాత్ర పోషిస్తున్నారు. మునుముందు మెగా కాంపౌండ్‌లోని పెళ్లికాని హీరోలు, అమ్మాయిలందరికీ ఆయనే పెళ్లి పెద్ద అవనున్నారని టాక్.
![]() |
![]() |