![]() |
![]() |

గత వారంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. సుమారు నెల రోజుల పాటు 'జిల్' ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న 'రాధే శ్యామ్' చిత్రీకరణ అక్కడ జరగనుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా బుధవారం ప్రభాస్ దగ్గరకి వెళ్ళింది. షూటింగులో జాయిన్ అయింది. ఇటలీలో కీలకమైన సన్నివేశాలు చేయనున్నారు. యూరప్ నేపథ్యంలో ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
నెలాఖరు వరకూ ఇటలీలో 'రాధే శ్యామ్' చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేశారు. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు. అంతకంటే ముందు 13న పూజా హెగ్డే పుట్టినరోజు. వీళ్లిద్దరి పుట్టినరోజులు ఇటలీలో సెలబ్రేట్ చేసుకోనున్నారు. 'సాహో' తరవాత ప్రభాస్ హీరోగా యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రమిది. ప్రభాస్ పెదనాన్న గోపికృష్ణా మూవీస్ కూడా నిర్మాణంలో పాలుపంచుకుంటోంది.
![]() |
![]() |