![]() |
![]() |
.webp)
గుణశేఖర్ లేటెస్ట్ ఫిల్మ్ 'శాకుంతలం'లో సమంత ఫస్ట్ లుక్ నిన్ననే బయటకు వచ్చింది. శకుంతల పాత్రధారిగా సమంత అప్పీరెన్స్ సూపర్‌గా ఉందంటూ ప్రశంసలు వచ్చాయి. ఇదే సందర్భంలో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను నిర్వహించింది. ఒక ఫాలోవర్ ఆమెను రిప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. దీనికి రెస్పాండ్ అయిన సమంత, రిప్రొడ్యూస్ (పునరుత్పత్తి) పదాన్ని ఎప్పుడు వాడాలో తెలుసుకోమని సుద్దులు చెప్పింది.
హీరో నాగచైతన్య నుంచి విడిపోతున్నట్లు ప్రకటించాక, విడాకుల కోసం వెయిట్ చేస్తోంది సమంత. ఇప్పుడామె ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలకు సంతకం చేస్తూ పూర్తిగా తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. నయనతార, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో సమంత నటించిన 'కాదువాకుల రెండు కాదల్' ఏప్రిల్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. తెలుగులో ఈ మూవీ 'కన్మణి రాంబో ఖతీజ' పేరుతో రానున్నది.
ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత ప్రశ్న-సమాధానం సెషన్‌ను నిర్వహించినప్పుడు ఒక అభిమాని ఆమెను, "నువ్వు పునరుత్పత్తి చేశావా, నేను నిన్ను పునరుత్పత్తి చేయాలనుకుంటున్నాను" అని చెప్పాడు. ఆ అభ్యంతరకరమైన ప్రశ్నను స్వీకరించిన సమంత, అతనికి హితబోధ చేయాలని నిర్ణయించుకుంది. "ఒక వాక్యంలో పునరుత్పత్తి అనే మాటలను ఎలా ఉపయోగించాలి. ముందుగా దానికి గూగుల్ చేసి ఉండాలా?" అని సమాధానమిచ్చింది.

ధ్యానం గురించి, తన బెస్ట్ ఫ్రెండ్ గురించీ, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం గురించిన ప్రశ్నలకు సమంత సమాధానం ఇచ్చింది. సమంత చివరిగా 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్‌తో కలిసి 'ఊ అంటావా మా ఉఊ అంటావా మావ' అనే స్పెషల్ సాంగ్‌లో కనిపించింది.
![]() |
![]() |