![]() |
![]() |

టాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన కాంబినేషన్‌లలో నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను జోడి ఒకటి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సింహా’(2010), ‘లెజెండ్’(2014) కలెక్షన్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా (‘BB3’) రూపొందుతోంది. గత చిత్రాల తరహాలోనే ఇది కూడా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. కాగా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘ఫస్ట్ రోర్’ వీడియో యూట్యూబ్ ముంగిట రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టుకోవడంతో ‘BB3’పై అంచనాలు పెరిగాయి. టీజర్‌కి తగ్గట్టే సినిమా కూడా ఉంటే.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ హ్యాట్రిక్ కొడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇదివరకు బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలు కూడా వారిద్దరి కెరీర్‌లో ఎప్పటికప్పుడు హయ్యెస్ట్ గ్రాసర్స్‌గానే నిలిచాయి. ఈ ఇరువురి ఫస్ట్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’ ఆ టైమ్‌లో అటు బాలయ్యకి, ఇటు బోయపాటికి కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్ మూవీ కాగా.. సెకండ్ ఫిలిమ్‌గా వచ్చిన ‘లెజెండ్’ కూడా వారిద్దరి పూర్వ చిత్రాల రికార్డులను తిరగరాయడమే కాకుండా లాంగెస్ట్ రన్ చూసిన మూవీగానూ నమోదయింది. ఈ నేపథ్యంలో సెంటిమెంట్ రిపీట్ అయి.. ‘BB3’ అటు బాలయ్య, ఇటు బోయపాటి ఇద్దరికీ కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలుస్తుందేమో చూడాలి. కాగా ‘BB3’.. 2021 సంక్రాంతికి జనం ముందుకు రావచ్చనే ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను థర్డ్ జాయింట్ వెంచర్‌ని ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. యువ సంగీత సంచలనం తమన్ బాణీలను అందిస్తున్నాడు.
![]() |
![]() |