![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణ జూన్ 10న షష్టి పూర్తి జరుపుకుంటున్నారు. నటనలో తండ్రికి తగ్గ వారసుడని ఎప్పుడో పేరు తెచ్చుకున్నారు. కొన్ని విషయాల్లో ఇద్దరికీ కొన్ని సారూప్యతలు ఉన్నాయి. అలాంటి వాటిలో డ్యూయల్ రోల్ ఒకటి. భారతదేశంలోనే అత్యధిక చిత్రాల్లో డ్యూయల్ రోల్ పోషించిన రికార్డ్ విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు పేరిట ఉంది. ఆయన తన కెరీర్‌లో 35 చిత్రాలకు మించి ద్విపాత్రలు పోషించారు. ఆయన తర్వాతి తరంలో అత్యధిక చిత్రాల్లో డ్యూయల్ రోల్ చేసిన రికార్డును బాలకృష్ణ సొంతం చేసుకున్నారు. వంద చిత్రాలు పూర్తి చేసేలోపుగానే 15 సినిమాల్లో ద్విపాత్రలు, మరో సినిమాలో (అధినాయకుడు) త్రిపాత్రలు ధరించారు. బాలయ్య తరం హీరోల నుంచి ఇప్పటివరకూ తెలుగులో మరే హీరో ఇన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్ పోషించలేదు. అలా తండ్రి తర్వాత ఆ ఘనతను సొంతం చేసుకుని, తగిన వారసుడనని ఆయన నిరూపించారు.
బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసిన సినిమాలు
1. అపూర్వ సహోదరులు (1986)
2. రాముడు - భీముడు (1988)
3. ఆదిత్య 369 (1991) (కృష్ణకుమార్, శ్రీకృష్ణదేవ రాయలు)
4. బ్రహ్మర్షి విశ్వామిత్ర (హరిశ్చంద్రుడు, దుష్యంతుడు) (1991)
5. మాతో పెట్టుకోకు (1995)
6. శ్రీ కృష్ణార్జున విజయము (శ్రీకృష్ణుడు, అర్జునుడు) ( (1996)
7. పెద్దన్నయ్య (1997)
8. సుల్తాన్ (1999)
9. చెన్నకేశవరెడ్డి (2002)
10. అల్లరి పిడుగు (2005)
11. ఒక్క మగాడు (2008)
12. పాండురంగడు (2008) (శ్రీకృష్ణుడు, పుండరీక రంగనాథుడు)
13. సింహా (2010)
14. పరమవీరచక్ర (2011)
15. లెజెండ్ (2014)
ట్రిపుల్ రోల్ చేసిన సినిమా
16. అధినాయకుడు (2011)
![]() |
![]() |