![]() |
![]() |

కరోనా వైరస్ వల్ల అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా యూనిట్ కొత్త లొకేషన్స్ వేటలో పడింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ షూటింగ్ చేశారు. అయితే అందులో అల్లు అర్జున్ పాల్గొనలేదని సమాచారం. కేరళలోని అడవుల్లో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అక్కడికి వెళ్లి షూటింగ్ ప్రారంభించే లోపు కరోనా వచ్చి పడింది. ఇప్పుడు అంత దూరం వెళ్ళడం ఎందుకని తెలుగు రాష్ట్రాల లోని వికారాబాద్, తలకోన, మారేడుమిల్లి ప్రాంతాలలో షూటింగ్ చేయడానికి సరిపడా లొకేషన్స్ ఫైనలైజ్ చేశారు. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
"ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసినా రావడానికి నేను రెడీ అని అల్లు అర్జున్ గారు చెప్పారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా మన తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ చేస్తాం. ఇప్పటికిప్పుడు సెట్స్ మీదకు వెళ్లడం కుదరదు. జూలైలోనే షూటింగ్ స్టార్ట్ చేయడం సాధ్యమవుతుంది" అని 'పుష్ప' సినిమాను నిర్మిస్తున్న సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన యలమంచిలి రవి శంకర్ తెలిపారు. 'ఆర్య', 'ఆర్య 2' సినిమాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఆల్రెడీ దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేశారట.
![]() |
![]() |