![]() |
![]() |

సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తో సూపర్ స్టార్ మహేష్ బాబు థియేటర్లలో సందడి చేశారు. సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నారు. ఆ సినిమా విడుదల సమయంలోనే మూడు నెలలు బ్రేక్ తీసుకోవాలి అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అనుకోకుండా కరోనా రావడంతో మూడు నెలలు కంటే పెద్ద బ్రేక్ దొరికింది.
మహేష్ బ్రేక్ తీసుకున్న సమయంలో 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత ఆయన చేయబోయే సినిమా విషయంలో కొంచెం సందిగ్ధ వాతావరణం నెలకొన్నది. చివరికి, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయాల్సిన కథను పక్కనపెట్టి కాకుండా పరశురామ్ దర్శకత్వంలో కొత్త కథతో 'సర్కారు వారి పాట' ప్రకటించారు. ఈ సినిమా ప్రకటించిన సమయానికి షూటింగులు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి. అయితే, దర్శకుడు బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డారు.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం షూటింగులకు అనుమతి ఇవ్వడంతో సెప్టెంబర్ లో 'సర్కారు వారి పాట' షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుందని సమాచారం.
![]() |
![]() |