![]() |
![]() |

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సినిమా, టీవీ షూటింగులు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చినా... ఇప్పటికీ ఇప్పుడు షూటింగులు స్టార్ట్ చేయడానికి టాలీవుడ్ రెడీగా లేదు. ఏది ఏమైనా జూన్ తర్వాతే షూటింగులు స్టార్ట్ చేయాలని అనుకుంటోంది. అగ్ర కథానాయకులతో చిత్రాలు నిర్మిస్తున్న నిర్మాతలది అదే అభిప్రాయం అని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఈ రోజు (మంగళవారం) సమావేశం అవుతున్నారు. దీని తర్వాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. అందులో నిర్మాతలు అందరూ కలిసి షూటింగు ఎప్పుడు ప్రారంభించాలో చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఏది ఏమైనా జూలైలోనే షూటింగ్ మొదలు కావొచ్చని సమాచారం. ఈ లోపు ఓటిటికి సినిమాలు అమ్మాలనుకునేవారు, వెబ్ సిరీస్ కంప్లీట్ చేయాలనుకునేవారు షూటింగ్స్ స్టార్ట్ చేస్తే చేయవచ్చు.
వెంకటేష్ కథానాయకుడిగా ఆయన సోదరుడు సురేష్ బాబు నారప్ప సినిమా నిర్మిస్తున్నారు. మా సంస్థలో చేసే సినిమాలు ఇప్పట్లో మొదలుపెట్టాలనుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. అల్లు అర్జున్ హీరోగా నిర్మిస్తున్న 'పుష్ప' సినిమా షూటింగును జూలైలో, మహేష్ బాబు హీరోగా నిర్మిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా షూటింగును సెప్టెంబర్ లో చాట్ చేయాలని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ డిసైడ్ అయ్యింది. నటసింహం నందమూరి బాలకృష్ణ షూటింగ్ చేయడానికి రెడీ గా ఉన్నప్పటికీ దర్శకుడు బోయపాటి శ్రీను మాత్రం వచ్చే నెలలోనే షూటింగ్ ప్లాన్ చేశామని చెబుతున్నారు. షూటింగులకు చొరబడకుండా వేచి చూసే ధోరణిలోనే పలువురు ఉన్నట్లు తెలుస్తోంది.
![]() |
![]() |