![]() |
![]() |

వాయిదాలోయ్... వాయిదాలు! ఇవి కోర్టు వాయిదాలు కాదు... థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రావలసిన సినిమా వాయిదాలు! మార్చి నెలాఖరున, ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. లాక్ డౌన్ ప్రభావం మేలో, తరవాత నెలల్లో విడుదల కావాల్సిన సినిమాలపైనా పడింది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న 'మేజర్' విడుదల కూడా వాయిదా పడిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ముంబయ్ 26/11 ఉగ్ర దాడుల్లో తాజ్ హోటల్‌లో ప్రజలను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఎన్ఎస్‌జి కమాండో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితంగా ఆధారంగా 'మేజర్' తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ నెలలో విడుదల చేయాలనుకున్నారు. కానీ, కరోనా కారణంగా లాక్ డౌన్ వచ్చి పడింది. 'మేజర్' షూటింగ్ షెడ్యూల్స్ కి బ్రేకులు వేసింది. మళ్ళీ షూటింగులు మొదలైన తరవాత కొత్త షెడ్యూల్స్ వేయాలి. ఆర్టిస్టులు డేట్స్ అడ్జస్ట్ కావాలి. అందుకని, సినిమా విడుదలను వచ్చే ఏడాదికి వాయిదా వేశారట. ఒక్క 'మేజర్' మాత్రమే కాదు... షూటింగులకు బ్రేక్ పడటంతో ముందుగా అనుకున్న విడుదల తేదీకి సినిమాలు రెడీ అయ్యే పరిస్థితి లేదు. అందుకని, వాయిదా వేయడం ఒక్కటే మార్గమని డిసైడ్ అవుతున్నారు.
![]() |
![]() |