![]() |
![]() |

కొరటాల శివ డైరెక్షన్‌లో రెండోసారి 'భరత్ అనే నేను' మూవీ చేసి, హిట్ కొట్టాడు మహేశ్. దాని తర్వాత అతను వరుసగా అదివరకు పనిచెయ్యని దర్శకులతో తొలిసారి పనిచేస్తూ వస్తున్నాడు. వంశీ పైడిపల్లితో 'మహర్షి', అనిల్ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలు చేసిన అతను ఇప్పుడు తొలిసారి పరశురామ్ డైరెక్షన్‌లో చేసేందుకు సిద్ధమవుతున్నాడు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయాక ఈ కాంబినేషన్ మూవీ పట్టాలెక్కనున్నది. ఈ మూవీ తర్వాత మహేశ్ ఏ డైరెక్టర్‌తో వర్క్ చేస్తాడనే విషయంలో ఇంత దాకా క్లారిటీ లేదు. వంశీ పైడిపల్లికి మరో చాన్స్ ఇస్తాడని ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది కానీ, అదెప్పుడు ఇస్తాడనేది తేలలేదు.
'మహర్షి' మూవీ తర్వాత మరోసారి మహేశ్‌నే నమ్ముకొని కథ రెడీ చేసుకొని కూర్చుని ఉన్నాడు వంశీ. పరశురామ్‌తో మహేశ్ మూవీ ఖాయమైనాక కూడా అతను మరో హీరోతో చేయాలని అనుకోవట్లేదు. ఇదిట్లా ఉండగా, మహేశ్ ఇప్పటివరకూ తాను పనిచేయని మరో డైరెక్టర్‌తో పనిచేసే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. అతను.. హైలీ టాలెంటెడ్ డైరెక్టర్‌గా ప్రశంసలు పొందిన హరీశ్ శంకర్! అవును.. ఇప్పటికే మహేశ్ కోసం హరీశ్ స్టోరీ రెడీ చేశాడని తెలుస్తోంది. మహేశ్‌కు అతను కథ వినిపించాడా, లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. 'గద్దలకొండ గణేష్' మూవీని హరీశ్ రూపొందించిన విధానం మహేశ్‌ను బాగా ఇంప్రెస్ చేసిందనేది ఇన్‌సైడ్ టాక్. అతను కూడా ఈ కొత్త కాంబినేషన్ విషయంలో సుముఖంగానే ఉన్నట్లు వినికిడి. త్వరలోనే దీనిపై మరికొంత సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది.
![]() |
![]() |