![]() |
![]() |

రానా దగ్గుబాటి టైటిల్ రోల్ పోషించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'అరణ్య' తొలిరోజు వసూళ్లు మరీ తీసికట్టుగా ఉన్నాయి. మార్చి 26న విడుదలైన ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది రూ. 1.38 కోట్ల షేర్ మాత్రమే. ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన ఈ జంగిల్ మూవీ ఆడియెన్స్‌ను ఎట్రాక్ట్ చేయడంలో సక్సెస్ కాలేకపోయిందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. మొదటి రోజు నైజాంలో రూ. 44 లక్షలు, ఆంధ్రలో రూ. 75.8 లక్షలు, రాయలసీమలో రూ. 18 లక్షలు షేర్ వచ్చింది.
ఈ మూవీని సురేశ్ ఫిలిమ్స్ ద్వారా నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేశారు. బడ్జెట్ పరంగా చూస్తే.. అన్ని భాషల్లో కలిపి 'అరణ్య'కు రూ. 60 కోట్ల దాకా ఖర్చయ్యిందని సమాచారం. ఇందులో ఇప్పటికే డిజిటల్ సహా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా దాదాపు రూ. 45 కోట్ల దాకా వచ్చిందని చెప్తున్నారు. అంటే థియేటర్ల ద్వారా అన్ని భాషల్లో రూ. 15 కోట్ల షేర్ వస్తే బడ్జెట్ అంతా వచ్చినట్లవుతుంది. అయితే తెలుగు వెర్షన్‌కు తొలిరోజు వచ్చిన షేర్ మరీ తక్కువగా ఉండటంతో ఆశించిన షేర్ రావడం కష్టమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
స్క్రీన్‌ప్లేలో లోపాలు, విష్ణు విశాల్, జోయా హుస్సేన్ పాత్రలు అర్ధంతరంగా మాయమైపోవడం, అప్పటిదాకా తమతో కలిసున్న రానాపై ఏనుగులు అపోహపడినట్లు చూపించడం వంటివి 'అరణ్య'కు మైనస్‌గా మారాయి.
![]() |
![]() |