![]() |
![]() |

రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ రూపొందించిన 'రంగస్థలం' చిత్రం ఆ ఇద్దరి కెరీర్‌లలో హయ్యెస్ట్ గ్రాసర్‌గా రికార్డులకెక్కింది. 2018లో టాలీవుడ్‌లో టాప్ గ్రాసర్‌గా నిలిచిన ఈ మూవీ త్వరలో తమిళంలో విడుదల కాబోతోంది. నేడు రామ్‌చరణ్ బర్త్‌డేని పురస్కరించుకొని మే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
సమంత హీరోయిన్‌గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'రంగస్థలం' మార్చి 30న విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు ప్రేక్షకుల అపూర్వ ఆదరణను సంపాదించింది. ఇందులో చెవిటివాడైన చిట్టిబాబు పాత్రలో చరణ్ ప్రదర్శించిన అభినయానికి ముచ్చటపడని వాళ్లు లేరు. అతని కెరీర్‌లోనే చిట్టిబాబు పాత్ర పోషణ అత్యున్నతం అని అందరూ ప్రశంసించారు. బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును చరణ్ అందుకున్నాడు కూడా.
దేవి శ్రీప్రసాద్ సంగీతం, రత్నవేలు ఛాయాగ్రహణం రంగస్థలంకు ప్లస్ అయ్యాయి. ఆ ఇద్దరూ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు 'రంగస్థలం'ను అదే పేరుతో 7జి ఫిలిమ్స్ సంస్థ తమిళంలో మే నెలలో విడుదల చేయబోతోంది.

![]() |
![]() |