![]() |
![]() |

రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా నేడు (మార్చి 27) 'ఆచార్య' మూవీలో ఆయన లుక్ పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో సింగిల్‌గా కాకుండా చిరంజీవితో కలిసున్నాడు చరణ్. ఇద్దరూ ఆలివ్ గ్రీన్ దుస్తుల్లో గన్స్ పట్టుకొని ఒక గూడెంలో నడుస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఇద్దరూ గడ్డం కొంచెం పెంచి ఉన్నారు. చిరంజీవి ఓ చేత్తో గన్ పట్టుకొని ఓ వైపు చూస్తుంటే, చరణ్ రెండు చేతుల్తో గన్ పట్టుకొని అదేవైపు చూస్తున్నాడు.
ఈ పోస్టర్‌ను తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసిన నిర్మాణ సంస్థలు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, "Camaraderie of Comrades. Wishing our Mighty #Siddha a very Happy Birthday. #HBDRamCharan #AcharyaOnMay13" అని పోస్ట్ చేశాయి. ఒక సినిమాలో ఒకే ఫ్రేమ్‌లో మెగాస్టార్, మెగా పవర్‌స్టార్ ఇద్దరూ కనిపిస్తోన్న పోస్టర్ బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలకు హద్దులేకుండా పోయింది. ఆన్‌లైన్‌లో ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతోంది.
ఈ పోస్టర్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన చిరంజీవి "ఆచార్య "సిద్ధ" ##HappyBirthdayRamcharan" అంటూ ట్వీట్ చేశారు. ఈ మూవీలో ఆచార్యగా చిరంజీవి, సిద్ధగా చరణ్ నటిస్తున్నారు.
తండ్రి చేసిన ఈ ట్వీట్‌ను రిట్వీట్ చేసిన రామ్‌చరణ్, "నీతో కలిసి నటించడం కల నిజమవడం కంటే ఎక్కువ నాన్నా! థాంక్యూ. ఇంతకంటే బెటర్ బర్త్‌డే గిఫ్ట్‌ను ఆశించను! నువ్వు నా ఆచార్యవి." అని రాసుకొచ్చాడు.
డైరెక్టర్ కొరటాల శివ, "ధర్మానికి ధైర్యం తోడైన వేళ #Siddha #Acharya #HBDRamCharan #AcharyaOnMay13" అని రాసి, పోస్టర్‌ను షేర్ చేశారు.

చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్‌చరణ్ జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. మణిశర్మ సంగీతం, తిరు సినిమాటోగ్రఫీ అందిస్తోన్న 'ఆచార్య' మే 13న విడుదలకు సిద్ధమవుతోంది.
![]() |
![]() |