![]() |
![]() |

`మిస్టర్ పెళ్ళాం`, `శుభలగ్నం`, `శుభ సంకల్పం`, `మావిచిగురు` చిత్రాలతో తెలుగువారిని విశేషంగా అలరించారు నిన్నటి తరం కథానాయిక ఆమని. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా షిప్ట్ అయ్యాక.. `ఆ నలుగురు`, `భరత్ అనే నేను` చిత్రాల్లో తల్లి పాత్రల్లో ఆకట్టుకోవడమే కాకుండా విజయాలు చూశారు. అయితే, ఎటొచ్చి గత కొంతకాలంగా యంగ్ హీరోలకు ఆమని అమ్మ పాత్రల్లో నటిస్తున్న సినిమాలేవీ వర్కవుట్ కావడం లేదు.
నితిన్ కి తల్లిగా నటించిన `శ్రీనివాస కళ్యాణం` మొదలుకుని.. రీసెంట్ గా వారం రోజుల గ్యాప్ లో రిలీజైన శర్వానంద్ `శ్రీకారం`, కార్తికేయ `చావు కబురు చల్లగా` వరకు యువ కథానాయకులకు ఆమని తల్లి పాత్రల్లో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఆయా చిత్రాలతో నటిగా ఆమనికి మంచి గుర్తింపు వచ్చినా ఫలితాలు మాత్రం నిరాశజనకమే. ఈ నేపథ్యంలో.. జూన్ 19న రాబోతున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`పైనే అందరి దృష్టి వుంది. హీరోగా ఇప్పటివరకు అసలు విజయాలే లేని అఖిల్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. అఖిల్ కి అయినా ఆమని ఫ్యాక్టర్ ప్లస్ అవుతుందో లేదో చూడాలి.
`సిసింద్రీ` (1995) వంటి విజయవంతమైన చిత్రం తరువాత అఖిల్ కి అమ్మగా ఆమని నటిస్తున్న సినిమా కావడం.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`పై కాస్త ఆసక్తిని రేకిత్తిస్తున్న అంశం. అయితే, ఆమని లేటెస్ట్ ట్రాక్ రికార్డ్ చూస్తే.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`కి ఆమె ఫ్యాక్టర్ మైనస్ అవుతుందేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చూద్దాం.. ఏం జరుగుతుందో?
![]() |
![]() |