![]() |
![]() |

ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్ చేస్తున్న సినిమాల్లో `దృశ్యం 2` ఒకటి. `దృశ్యం`కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ లో వెంకీకి జోడీగా మీనా నటిస్తోంది. `దృశ్యం 2` మలయాళ వెర్షన్ ని తెరకెక్కించిన
జీతూ జోసెఫ్.. ఈ రీమేక్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. `దృశ్యం` ఏ నెలలో విడుదలైందో సరిగ్గా అదే నెలలో `దృశ్యం 2`ని రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోందట. `దృశ్యం` 2014 జూలై 11న విడుదల కాగా.. `దృశ్యం 2`ని కూడా జూలై రెండో
వారంలో (జూలై 9) రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. ఆ దిశగానే చకచకా షూటింగ్ జరుపుతున్నారని బజ్. మరి.. `దృశ్యం` తరహాలో `దృశ్యం 2` కూడా జూలై నెలలో కాసుల పంట పండిస్తుందేమో
చూడాలి.
కాగా, `దృశ్యం 2`లో నదియా, నరేశ్, ఎస్తేర్ అనిల్, సంపత్ రాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ బాణీలు అందిస్తున్నారు.
![]() |
![]() |