![]() |
![]() |

భారతదేశపు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంగ్లండ్ కంపెనీ నుంచి తీసుకున్న 3 కోట్ల 47 లక్షల రూపాయలకు సంబంధించి రెహమాన్ ఇన్‌కమ్ టాక్స్ చెల్లించలేదని ఐటీ శాఖ ఆరోపించింది. ఆ పన్నును రెహమాన్ ఎగవేశారంటూ ఐటీ డిపార్ట్‌మెంట్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన హైకోర్టు రెహమాన్‌కు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఐటీ శాఖ ఆరోపణలకు సమాధానాలివ్వాలని అందులో ఆదేశించింది.
2011-12 సంవత్సరానికి సంబంధించి యు.కె.కు చెందిన లిబ్రా మొబైల్స్ నుంచి రెహమాన్ 3.47 కోట్ల రూపాయలను అందుకున్నాడనీ, ఆ కంపెనీ కోసం ప్రత్యేకంగా రింగ్‌టోన్స్ కంపోజ్ చేసివ్వడానికి ఆయన మూడేళ్ల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడనీ, తన పిటిషన్‌లో ఐటీ శాఖ తెలిపింది. దానికి సంబంధించిన పేమెంట్‌ను నేరుగా తన ఎ.ఆర్. రెహమాన్ ఫౌండేషన్‌కు పంపాల్సిందిగా ఆ కంపెనీకి రెహమాన్ సూచించడంతో ఆ కంపెనీ అలాగే చేసిందని అది తెలియజేసింది. అయితే రెహమాన్ ఫౌండేషన్‌కు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద లైసెన్స్ లేదనీ, రెహమాన్ అందుకున్న డబ్బుకు టాక్స్ చెల్లించాల్సి ఉన్నా, ఆ పని చెయ్యలేదనీ ఐటీ శాఖ ఆరోపించింది.
![]() |
![]() |