![]() |
![]() |

అఖిల్ అక్కినేని కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ స్టైలిష్ ఎంటర్టైనర్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను ప్రకటించారు. ఇందులో అఖిల్ సరసన రష్మిక కథానాయికగా నటించనుందని సమాచారం. ప్రస్తుతం ఆమెతో డిస్కషన్లు జరుగుతున్నాయి.
ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్, సరెండర్2సినిమా బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. 'ఏకే ఎంటర్టైన్మెంట్స్' అనిల్ సుంకర కు చెందిన బ్యానర్ కాగా... 'సరెండర్2సినిమా' బ్యానర్ స్టార్ట్ చేసిన సురేందర్ రెడ్డి దీంతో నిర్మాతగా మారుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు'లో రష్మిక నటించింది. ఆ సినిమా ప్రొడక్షన్లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కూడా ఉంది. ఆల్రెడీ ప్రొడక్షన్ హౌస్ ఆమెకు తెలుసు. కనుక ఒకే చెబుతారేమో చూడాలి.
అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలలో అఖిల్ సరసన కొత్త హీరోయిన్లు నటించారు. ప్రస్తుతం నటిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'లో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డేని తీసుకున్నారు. ఇప్పుడు రష్మిక కోసం ట్రై చేస్తున్నారు. ఇకపై అఖిల్ సినిమాల్లో స్టార్ హీరోయిన్లను చూడవచ్చేమో.
అఖిల్ కోసం తీవ్రవాదం నేపథ్యంలో సాగే కథను రచయిత వక్కంతం వంశీ, దర్శకుడు సురేందర్ రెడ్డి సిద్ధం చేశారట. ఇందులో అఖిల్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపిస్తాడని సమాచారం.
![]() |
![]() |